ఆస్తి రాయించుకుని అనాథను చేశారు.. తండ్రి ఆవేదన

posted on: Feb 12, 2026 8:03AM

సమాజంలో పరిస్థితులు అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం అన్నట్లుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాల కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇందు  నిదర్శనమే ఓ తండ్రి ఆవేదన.  సికింద్రాబాద్ పరిధిలో నివాసిస్థున్న ఓ వృద్ధుడు తనను  , తన సొంత కూమార్తెలే మోసం చేశా రంటూ తన  ఇంటి ముందు ధర్నాకు దిగారు.

 తనకు ఉన్న ఆస్తి మొత్తాన్ని కూతుర్లు వారి పేర్లపై రాయించుకున్నారనీ, ఆ తరువాత   తనకు  తిండి కూడా పెట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల ఇల్లు అమ్మేశామని, మరో చోటికి వెళ్లాలని ఒత్తిడి చేయడమే కాకుండా తనను ఇంటి బయటకు గెంటేశారనీ ఆ వృద్ధ తండ్రి ఆరోపిస్తున్నాడు.

గత కొన్నిరోజులుగా సరైన ఆహారం కూడా దొరకక బస్తీలోనే బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నానని  కన్నీటి పర్యంతమ య్యాడు. బిడ్డల కోసమే సంపాదించాం... చివరికి వారే ఇలా చేస్తారని అనుకోలేదు అంటన్న వృద్ధుడి బాధను చూసి స్థానికులు కదిలిపోయారు. విషయం తెలిసిన పొరుగు వారు, బస్తీ ప్రజలు ఆయన కు ఆహారం అందిస్తూ సహాయం చేస్తున్నారు.ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుడికి న్యాయం చేయాలని, పోలీసులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...