Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.. బండి సంజయ్
posted on: Apr 18, 2026 11:38AM

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17 ఒక చీకటి రోజుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిరూపమైన మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు దేశంలోని ప్రతి తల్లిక, అక్కాచెల్లెళ్ల ను అవమానించాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. మహిళా హక్కుల విషయంలో విపక్షాల అసలు రంగు బయటపడిందన్నారు.
మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ త కూట మి విషాన్ని కక్కిందన్న బండి సంజయ్.. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగకూడదన్నదే ఆ పార్టీల అసలు ఉద్దేశమని ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయ స్వార్థం కోసం మహిళా హక్కులను కబళించడం క్షమించరాని పాపమనీ విమర్శించారు. దేశ మహిళలను ఓడించినందుకు ఈ కూటమి నేతలు సంబరాలు చేసుకుంటారా? అని నిలదీశారు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు త్వరలో ప్రజలే ఇండియా కూటమికి బుద్ధి చెబుతారన్నారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ముమ్మాటికీ మహిళా ద్రోహులన్న బండి సంజయ్.. . అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని ఈ పార్టీలు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందన్న ఆయన.. గతంలో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని కాలయాపన చేస్తూ వంచించారని, ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఛీ కొడుతున్నా ఇండియా కూటమి నేతలకు జ్ఞానోదయం కలగడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మహిళల పట్ల ఇదే విధమైన వివక్షను ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు.
మహిళా శక్తి అంటే ఏమిటో చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న బండి సంజయ్.. రాబోయే ఎన్నికల్లో.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు మహిళలు మహిళా రిజర్వేషన్ ను వ్యతిరేకించిన పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందనీ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్ల సాధన దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.



.webp)


