ఓం తారే...తుత్తారే...తురే సోహా... కరోనాకు విరుగుడుగా తారామంత్రం

posted on: Jan 30, 2020 9:02AM

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతోంది... కరోనా పేరు వింటేనే ఆమడదూరం జరుగుతున్నాయి... ఇక, చైనా అయితే అతలాకుతలమవుతోంది... నగరాలకు నగరాలే స్తంభించిపోతున్నాయి... కరోనా దెబ్బకు చైనీయులంతా బెంబేలెత్తిపోతున్నారు... కరోనా కారణంగా ఇప్పటివరకు 150మంది మరణించగా.... వేలాది మంది ఈ వైరస్ బారినపడి అల్లాడిపోతున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో 70మందికి పైగా మృత్యువాత పడగా... గడిచిన 24గంటల్లో 30మంది మరణించడం చైనాను కలవరపెడుతోంది. ఇక, చైనాలో ఉన్న విదేశీయులైతే హుటాహుటిన తమ దేశాలకు పయనమవుతున్నారు.

కరోనా వైరస్ భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతుంటే.... టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మాత్రం... చిన్న మంత్రం జపిస్తే చాలు... ప్రాణాంతక కరోరా దరిచేరదని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ ...తారా మంత్రం... పఠించాలంటూ చైనీయులకు సూచించారు. అంతేకాదు... ఓం తారే... తుత్తారే... తురే సోహా... అంటూ మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను తన అనుచరుల కోసం దలైలామా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ తారామంత్రం... కరోనా వైరస్‌ దరిచేరకుండా... వ్యాపించకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుందని అన్నారు. అయితే, దలైలామా చెప్పిన ఈ మంత్రం ఇప్పుడు చైనాలో వైరల్ అవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...