కోస్తా జిల్లాలపై మొంథా తుఫాను ప్రభావం : హోం మంత్రి
posted on Oct 26, 2025 5:57PM

ఏపీ వ్యాప్తంగా మొంథా తుపాను 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పినట్లు ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హోం మంత్రి పేర్కొన్నారు. తుపాను పరిస్థితులపై విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన హోం మంత్రి, 100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశిస్తూ, హోం మంత్రి తెలిపారు. గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తుపానుపై అప్రమత్తంగా ఉన్నారని. భారీ హోర్డింగ్‌లను ముందుగానే తొలగిస్తున్నామని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆస్తి నష్టం తగ్గించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సాంకేతికతను వినియోగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో 6 ఎన్డీఆర్‌ఎఫ్, 13 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు హోం మంత్రి వెల్లడించారు.
కోస్తా జిల్లాలన్నింటిపైనా తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని, ముఖ్యంగా కాకినాడ పరిధిలోని ఆరు మండలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ తుపాను అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్ఠంగా గాలి వేగం 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అధికారులు హెచ్చరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.