Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
posted on: Jul 27, 2026 10:20AM
.webp)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురు స్తున్నాయి. ప్రస్తుతం సముద్రంపై కొనసాగుతున్న ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ వ్యవస్థ సోమవారం పారాదీప్– సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లో అక్కడ క్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు మంగళ వారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్ట మైన సూచనలు జారీ చేశారు.
ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి సహా యక చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక తెలంగాణలోనూ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లా లకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం నుంచే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఎల్‌బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్, కూకట్‌పల్లి, మెహదీ పట్నం, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ తది తర ప్రాంతాల్లో వర్షం నమోదైంది.
మరో రెండు గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ శాఖ అధికా రులు సూచించారు. ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటి కప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Cyclone in the Bay of Bengal, Heavy rains in Telugu states, IMD, Srikakulam, Vizianagaram, Visakhapatnam, Peddapalli, Karimnagar, Siddipet, Medak


.webp)



