ఈ డాక్టర్ వెహికిల్ సైకిల్!

posted on: Jan 30, 2026 8:32AM

కార్లు, బైకులు వంటి వాహనాలను కొందరు సామాజిక హోదాకు చిహ్నాలుగా భావిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా వాటిని వినియోగిస్తారు.  అనవసరంగా వాహనాల విపరీత వినియోగం కారణంగా పర్యావరణానికి చేటు అన్న విషయాన్ని గుర్తించరు. అయితే ఒంగోలుకు చెందిన ఓ వైద్యుడు మాత్రం.. తాను సైకిల్ మీదే ప్రయాణిస్తూ పర్యావరణ హితం తన మతం అని చాటుతున్నారు. ఒంగోలుకు చెందిన డాక్టర్ కొర్రపాటి సుధాకర్  ఒంగోలు నగరం, ఆ చుట్టుపక్కన 20 కిలోమీటర్ల పరిధిలో ఏ పని ఉన్నా సరే ఆయన వాహనం సైకిల్ మాత్రమే.

ప్రతి రోజూ తన ఇండి నుంచి ఆస్పత్రికి కూడా సైకిల్ మీదే వెడతారు.  ఇటీవల సంక్రాంతి పండగకు నగరం నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న స్వగ్రామమైన తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలేనికి ఈ డాక్టర్ సైకిల్ పై వెళ్లి వచ్చారు.   2016లో  ఆవిర్భవించిన ప్రకాశం గ్లోబల్‌ ఎన్నారై ఫోరమ్‌(పీజీఎన్‌ఎఫ్‌)  సంస్థకు కన్వీనర్ అయిన డాక్టర్ కొర్రపాటి సుధాకర్  పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సంస్థ తరఫున ఇప్పటికి సుమారు వెయ్యి వరకు సైకిళ్లను ఉచితంగా అందజేశారు. 170 ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు సమకూర్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...