విదేశీ ఉద్యోగం పేరుతో డాక్టర్ కు టోకరా.. హైదరాబాద్ లో మరో సైబర్ క్రైమ్

posted on: Mar 23, 2026 11:00AM

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తూ కోట్లక కోట్లు దోచేస్తున్న సంఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా   విదేశంలో ఉద్యోగం ఆశ చూపించి ఓ వైద్యుడిని వలలో వేసుకున్న సైబర్ నేరగాళ్లు అతడి వద్ద నుంచి భారీగా సొమ్ము రాబట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.  

హైటెక్ సిటీలో ఉన్న ఓ హాస్పిటల్ లో   ఎనస్తీషియన్ గా పని చేస్తున్న  ఓ డాక్టర్  సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు.   డాక్టర్ కి ఆస్ట్రేలియాలో ఉద్యోగం కల్పిస్తామని తెలియజేస్తూ  ఓ ఈ-మెయిల్ వచ్చింది. ఫియోనా స్టాన్లీ ఆస్పత్రిలో ఉద్యోగం ఖాళీగా ఉందనీ, అన్ని అర్హతలూ ఉన్నందున ఆ ఉద్యోగం మీకు గ్యారంటీగా వస్తుందనీ, తాము వచ్చేలా చేస్తామంటూ ఆ మెయిల్ లో పేర్కొన్నారు. ఆ డాక్టర్ ను ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ కూడా చేసి ఉద్యోగానికి ఎంపికైనట్లు పేర్కొంటూ అప్పాయింట్ మెంట్ ఆర్డర్ కూడా పంపారు.  

దీంతో ఆ డాక్టర్  సైబర్ నేరగాళ్లను పూర్తిగా నమ్మి వారి వలలో చిక్కాడు.  ఈ మెయిల్ లోవచ్చిన అప్పాయింట్ మెంట్ అర్డర్ అనంతరం అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం నుంచి మాట్లాడు తున్నామని చెప్పి వీసా, ప్రాసెసింగ్ ఫీజులకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. వారి మాటలు నిజమని నమ్మిన బాధితుడు విడతల వారీగా పలు ఖర్చుల పేరిట మొత్తం రూ.10.15 లక్షలు బదిలీ చేశాడు. అయితే డబ్బులు చెల్లించిన తర్వాత మోసగాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించిన ఆ డాక్టర్ వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీ సులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...