కస్టమర్ల భద్రతే బ్యాంకుల లక్ష్యం కావాలి.. సీపీ సజ్జనర్

posted on: Apr 23, 2026 2:30PM

బ్యాంకులు ఖాతాల ఓపెనింగ్ టార్గెట్లకంటే కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సైబర్ నేరాల నుంచి ఒక్క కస్టమర్ కూడా బాధితుడు కాకుండా చూడ టమే ప్రధాన లక్ష్యంగా బ్యాంకర్లు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంకు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిన్మయ్ కుమార్ సహా 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ఉన్నతా ధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సిపి సజ్జనార్ మాట్లాడుతూ  సేఫ్ కస్టమర్ చాలెంజ్ ను బ్యాంకులు స్వీకరించాలని సూచించారు. 

ప్రతి బ్యాంకు శాఖ  జీరో మ్యూల్ అకౌంట్స్  లక్ష్యంగా పనిచేయాలని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఫిర్యాదుల ఆధా రంగా శాఖల పని తీరును అంచనా వేసుకోవాలని పేర్కొన్నారు.బ్యాంకు ఉద్యోగుల కీలక పనితీరు సూచికల్లో  ఖాతాల సంఖ్యకన్నా కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. 

ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో భాగంగా 850 కేసుల్లో రూ.150 కోట్ల మోసాన్ని గుర్తించాం. మ్యూల్ ఖాతాల ఓపెనింగ్‌లో సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేశామని వెల్లడిం చారు. అంతర్జాతీయ సైబర్ ముఠాలు కంబోడియా, వియత్నాం, దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి కార్యకలా పాలు కొనసాగిస్తూ స్థానిక బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై నేరాలకు పాల్పడు తున్నాయని తెలిపారు. 

కేవైసీ నిబంధ నలు ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుని, బ్యాంకింగ్ రంగం నుంచి బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించారు.ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందస్తుగా క్లోజ్ చేసేందుకు వచ్చే కస్టమర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సైబర్ నేరగాళ్ల ఒత్తిడితో డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా అన్నది పరిశీలించాలని సూచించారు. “మ్యూల్ హంటర్” వంటి ఆధునిక సాంకేతిక పరికరాలు వినియోగించడంతో పాటు 1930 హెల్ప్‌లైన్‌పై విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. సైబర్ నేరాల నెట్‌వర్క్ పూర్తిగా నిర్మూ లించే వరకు పోలీసుల చర్యలు కొనసాగుతాయని సీపీ స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...