ఆధ్యాత్మికత ముసుగులో గంజాయి సాగు.!

posted on: Jul 18, 2026 10:58AM

భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు జరగాల్సిన ఆశ్రమంలో గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. యాలాల మండలం గోవిందరావుపేట శివారు లోని ఓ స్వామీజీ ఆశ్రమం లో అక్రమంగా గంజాయి సాగు జరుగుతోందన్న సమాచారంతో టాస్క్‌ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహిం చారు.

ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక  గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. ఆశ్రమం పేరుతో గంజాయి సాగు చేస్తు న్నారా? దీనికి మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి నిందితులపై కేసు నమోదు చేసి విచా రణ కొనసాగిస్తు న్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరున్న ఆశ్రమంలో గంజాయి సాగు బయ టపడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

cultivation, Ganja, guise,  spirituality, Vikarabad, Govindaraopet 

google-ad-img
    Related Sigment News
    • Loading...