Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీఆర్ఎస్ కు క్రాస్ ఓటింగ్ భయం?
posted on: Mar 6, 2026 4:44PM

బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ భయంతోనే రాజ్యసభ ఎన్నికలకు దూరంగా జరిగిందా? రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే బీఆర్ఎస్ లో అభ్యర్థిని నిలపడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గెలిచే అవకాశం లేకున్నా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా బరిలోకి అభ్యర్థిని దింపాలని బీఆర్ఎస్ దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. బీఆర్ఎస్ తరఫున ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దింపి కాంగ్రెస్ ను ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాలని భావించింది. అలాగే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని కూడా భావించింది.
తీరా నామినేషన్ల గడువు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి వినా మరెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో వారిరువురి ఎన్నిక ఇక లాంఛనమే. రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
అయితే చివరికి బీఆర్ఎస్ మౌనంగా వెనక్కు తగ్గింది. ఇందుకు ప్రధాన కారణంగా బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్న భయమే అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండటంతో.. వారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే పార్టీ పరువు పోతుందన్న భయంతోనే బీఆర్ఎస్ వెనక్కు తగ్గిందంటున్నారు. అలాగే ఎలాగూ గెలిచే అవకాశం లేని ఎన్నికలలో పోటీ చేసి క్యాడర్ లో నిరాస, నిస్ఫృహలను పెంచడమెందుకన్న యోచనతో కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉందంటున్నారు.


.webp)



