Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వ్యవసాయ రుణాల మాఫీకి హైకోర్టు వ్యతిరేకం
posted on: Jul 1, 2014 11:20AM
.jpg)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు వ్యవసాయ రుణాల మాఫీపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకొనేందుకు తిప్పలుపడుతుంటే, ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న ‘హైకోర్టు ఆఫ్ హైదరాబాద్’ ప్రభుత్వాలకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసే హక్కులేదని నిన్న తీర్పు చెప్పింది. రైతులు బ్యాంకుల వద్ద తీసుకొన్న వ్యవసాయ రుణాలను కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు మాఫీ చేయకుండా ప్రభుత్వాలను ఆదేశించవలసిందిగా కోరుతూ మాజీ తెదేపా శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్ హైకోర్టులో పిటిషను వేసారు. దానిని విచారణకు చేప్పట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతీ సేన్ గుప్తా మరియు జస్టిస్ పీ.వీ.సంజయ్ కుమార్ లతో కూడిన ద్విసభ్య బెంచ్ నిన్న ఈ తీర్పును వెలువరించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోదని తేల్చి చెప్పింది. హైకోర్టు రుణమాఫీపై ఎటువంటి స్టే ఇవ్వలేదు గనుక, ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు తప్పనిసరిగా ముందుకే సాగవలసి ఉంటుంది. ఆర్ధికంగా కాస్తో కూస్తో ఆంద్ర ప్రభుత్వం కంటే కాస్త మెరుగయిన స్థితిలోనే ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్య నుండి ఏదోవిధంగా బయటపడే అవకాశం ఉంది. కానీ లోటు బడ్జెట్ తో ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన తెదేపాకు ఇదొక అగ్నిపరీక్షవంటిదే. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాష్ట్ర బ్యాంకర్లతో సమావేశమయినప్పుడు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయవలసిందిగా అభ్యర్దించారు. కానీ అందుకు బ్యాంకర్లు ఏ విధంగా స్పందించారో తెలియదు.


.jpg)
.jpg)


