పాక్ జట్టుపై విమర్శల వర్షం

posted on: Feb 16, 2026 9:50AM

టి20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) హైవోల్టేజ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా పాకిస్థాన్ ను చిత్తు చేసి ఏకపక్ష విజయం సాధించింది. 20 ఓవర్ల మ్యాచ్ లో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే  పాకిస్థాన్ ను కేవలం 114 పరుగులకు ఆలౌట్ చేసి ఘన విజయం సాధించిన టీమ్ ఇండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంటే.. పాక్ జట్టపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా ఆ దేశ మాజీ క్రికెటర్లు తమ దేశ జట్టు ఆటతీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.  పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ తమ దేశ  జట్టుపైనా,  క్రికెట్ బోర్డుపైనా చేసిన  విమర్శలు   క్రీడా ప్రపంచంలో సంచలనంగా మారాయి. పాకిస్థాన్ జట్టుకు భారత్ తో ఆడే అర్హత కూడా లేదని షోయబ్ అక్తర్ అన్నాడు. పాక్ ఓటమి తరువాత ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పాకిస్థాన్ జట్టు ఓటమిపై షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.  ఒకప్పుడు భారత్‌తో మైదానంలో పోరాడేవాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే టీమ్ ఇండియాను ఓడించడం అన్నది కలలో కూడా ఊహించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు  చైర్మన్ మోసిన్ నఖ్వీపై కూడా షోయబ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.  క్రికెట్ గురించి ఓనమాలు కూడా తెలియని వ్యక్తి పీసీబీ చైర్మన్ అయ్యాడనీ, అలాంటి అసమర్థులకు, అజ్ఞానులకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు ఎలా నడుస్తుందిని విమర్శించారు. మ్యాచ్ ను గెలిపించలేని ఆటగాడిని సూపర్ స్టార్ ను చేశారంటూ పరోక్షంగా బాబార్ అజామ్ పై విమర్శలు కురిపించారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...