Latest News
వివాహబంధంలోకి కుల్దీప్ యాదవ్
posted on: Mar 16, 2026 12:18PM
.webp)
టీమ్ ఇండియా మేజిక్ స్పిన్నర్, చైనా మన్ స్పెషలిస్ట్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న తన చిన్ననాటి స్నేహితురాలు వంశికా సింగ్ మెడలో కుల్దీప్ మూడు ముళ్లు వేసి వివాహబంధంలోకి అడుగు పెట్టాడు. వీరి వివాహ వేడుక ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శనివారం (మార్చి 14) అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కుల్దీప్ వివాహానికి క్రికెటర్లు తిలక్ వర్మ, యజ్వేంద్ర చాహల్, రింకూసింగ్ తదితరులు హాజరయ్యారు.
చాలా కాలంగా కుల్దీప్, వంశిక ప్రేమలో ఉన్నప్పటికీ, తమ వ్యక్తిగత విషయాలను చాలా వరకూ గోప్యంగానే ఉంచారు. చిన్ననాటి నుంచీ వీరి మధ్య ఉన్న స్నేహబంధం ప్రేమగా చిగురించి వివాహానికి దారి తీసింది. కుల్దీప్ వివాహం చేసుకున్న విషయం తెలియగానే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఇతర సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ సమీపిస్తుండటంతో, త్వరలోనే ఢిల్లీ లేదా ముంబైలో క్రికెట్ ప్రముఖుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కుల్దీప్ సింగ్ సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం కుల్దీప్ సింగ్ తన కెరీర్ లోనే టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కీలక వికెట్లు తీసి భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడటంతో, రాబోయే ఐపీఎల్ 2026లో ఆయన మరింత ఉత్సాహంగా బరిలోకి దిగుతాడని కల్దీప్ అభిమానులు భావిస్తున్నారు.






