ఏపీ సీఎంతో క్రికెట్ దేవుడు సచిన్ భేటీ.. ఎక్కడంటే
posted on: Feb 10, 2026 10:11AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ భేటీ అయ్యారు. కొద్ది నిముషాల పాటు జరిగిన ఈ భేటీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఈ భేటీ ఎక్కడ జరిగిందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయ్యింది. విషయమేంటంటే.. చంద్రబాబు హస్తిన పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఢిల్లీ విమానాశ్రయంలో ఉండగా అదే సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉన్న సచిన్ టెండూల్కర్ చంద్రబాబు వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.
కేంద్ర మంత్రులతో కీలక చర్యలు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోమవారం (ఫిబ్రవరి 9) ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తెలుగుదేశం ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో సీఎం చంద్రబాబు ఎంపీలతో సమావేశం అయ్యారు. అదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న సచిన్ టెండూల్కర్.. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారు.



.webp)


