టి20 వరల్డ్ కప్.. ట్రంప్ ను తాకిన క్రికెట్ ఫీవర్

posted on: Feb 9, 2026 8:37AM

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ కూ క్రికెట్ ఫీవర్ తాకింది. టి20 వరల్డ్ కప్ లో ఆడుతున్న అమెరికా జట్టుకు మద్దతుగా డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. టి20 వరల్డ్ కప్ టోర్నీపై ట్రంప్ స్పందించారు. ఈ టోర్నీలో అమెరికా క్రికెట్ జట్టు బలమైన పోటీదారని పేర్కొనడమే కాకుండా, అమెరికా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

తన సోషల్ మీడియా వేదిక ట్రూత్  సోషల్ వేదికగా ఆయన అమెరికా జట్టుకు మద్దతు ప్రకటించారు.    అమెరికా మొత్తం మీకు మద్దతుగా నిలుస్తోందనీ, టోర్నీలో సంచలనాలు నమోదు చేసే సత్తా అమెరికా క్రికెట్ జట్టుకు ఉందనీ పేర్కొన్నారు.   ఈ టోర్నీలో ఏ గ్రూపులో ఉన్న అమెరికా క్రికెట్ జట్టు తొలి మ్యాచ్ లో భారత్  చేతిలో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆ జట్టు సూపర్ 8 కు చేరాలంటే.. పాకిస్థాన్ తో తలపడబోయే తదుపరి మ్యాచ్ లో విజయం సాధించి తీరాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...