Latest News

కివీస్ పై వన్డే సిరీస్ ఓటమి.. గంభీర్ ను దుమ్మెత్తి పోస్తున్న అభిమానలు

posted on: Jan 20, 2026 8:41AM

కివీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమ్ ఇండియా 2-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలవడం ఇదే మొదటి సారి. హెడ్ కోచ్ తీరు కారణంగానే న్యూజిలాండ్ కు సిరీస్ ను అప్పగించామన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

న్యూజిలాండ్ తో మూడో వన్డేలో టీమ్ ఇండియా ఓటమి తరువాత ఇండోర్ స్టేడియం గంభీర్ వ్యతిరేక నినాదాలతో మార్మోగిపోయింది. ఆది టీమ్ ఇండియా ఆటగాళ్లను సైతం విస్మయానికి గురి చేసింది. కింగ్ విరాట్ కోహ్లీ అభిమానులను వారించేందుకు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.  న్యూజిలాండ్ తో సిరీస్ ఓటమొ తరువాత అన్ని వైపుల నుంచీ గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్ ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ గట్టిగా వస్తున్నది. 

గంభీర్ కోచింగ్‌లో భారత్ టీ20 ఫార్మాట్‌లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి విజయాలు సాధించినా.. టెస్టులు, వన్డేల్లో మాత్రం జట్టు ప్రదర్శన పేలవంగా ఉంటున్నది.   కాగా గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా కొనసాగాలే కాంట్రాక్ట్ ఉంది.  ఈ నేపథ్యంలో అభిమానుల డిమాండ్ ను బీసీసీఐ ఔదాల్చే పరిస్థతి లేదని క్రీడారంగ నిపుణులు అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...