Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కూలిన ఫైటర్ జెట్...ఇద్దరు పైలెట్ల దుర్మరణం
posted on: Mar 6, 2026 1:28PM

వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం గురువారం రాత్రి గల్లంతైన ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది. అసోం రాష్ట్రంలోని కార్బి ఆంగ్‌లోంగ్ జిల్లా సమీపంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్టు పేర్కొంది. శిక్షణలో ఉన్న రష్యాకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్.. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత కాసేపటికే ఇది ఓ మారుమూల కొండ ప్రాంతంలో అది కూలిపోయినట్టు సమాచారం. ఈ మేరకు ఆ ఏరియా భారీ పేలుడు శబ్దం వినిపించి, మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు.. వెంటనే గాలింపు ముమ్మరం చేశారు. జోర్హాట్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్టు అధికారులు తాజాగా గుర్తించారు. మృతిచెందిన పైలెట్లను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దుర్గాకర్‌గా గుర్తించారు. దుర్గాకర్ ఆపరేషన్ సింధూర్ యుద్ధ విమానం నడిపారు.






