ఏఐ యుగంలో భద్రతా అతి పెద్ద రక్షణ : సీపీ సజ్జనార్

 

డిప్ ఫేక్ లో తన ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే... అయితే ఏఐ యుగంలో భద్రతా పదం మీకు అతి పెద్ద రక్షణ అంటూ వీసీ సజ్జనార్ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు.

నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్‌ఫేక్‌ యుగంలో, సాంకే తికత అద్భుతాలు చూపుతున్నప్పటికీ మోసగాళ్లకు కూడా కొత్త మార్గాలు దొరికి నట్లు అయింది... ఇప్పుడు ఏఐ టూల్స్ సహాయంతో మీ ముఖం, మీ స్వరం అచ్చుగుద్ది నట్టుగా క్లోన్ చేయగలుగుతున్నారు. ఈ సాంకేతిక తను కొంతమంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తూ స్నేహితుడు, సహోద్యోగి లేదా అధికారిగా నటిస్తూ అమాయకులను టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్ప డుతున్నారని అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలంటూ హైదరాబాద్ సీపీ కొన్ని సూచనలు చేశారు.

మీ రక్షణ కోసం ‘సేఫ్ వర్డ్’ ఏర్పాటు చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితు లతో కలిసి ఒక ప్రత్యేకమైన ‘సేఫ్ వర్డ్’ (భద్రతా పదం) నిర్ణయించుకోండి. అనుమానాస్పదమైన కాల్స్ లేదా ఫోన్ కి సందేశం వచ్చిన ప్పుడు ఆ పదం ద్వారా నిజసత్యం ధృవీకరించండి.

మీ వ్యక్తిగత ఫోటోలు కానీ వీడియోలు కానీ లేదా ఆర్థిక వివరాలు ఎప్పుడూ ఎవరితోనూ కూడా పంచుకోవద్దని సీపీ సూచిం చారు. ఏఐ మనకు శక్తినిస్తుంది. కానీ అదే సమయంలో ప్రమాదంలోకి నెట్టగలదు కూడా....మన  అప్రమత్తతే మనకు రక్షణ....అంటూ  హైదరాబాద్ వీసీ సజ్జనార్ తన ఎక్స్ లో ట్వీట్ చేస్తూ అందర్నీ అప్రమత్తం గా ఉండాలంటూ సూచించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu