Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ ఆత్మహత్య
posted on: Mar 18, 2016 1:21PM

ఆవుని జాతీయ జంతువుగా గుర్తించాలనీ, రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతూ జరిగిన ఓ నిరసన కార్యక్రమం, ఒకరి మృతికి దారితీసింది. గుజరాత్‌కి చెందిన ‘గోరక్ష ఏక్తా సమితి’కి చెందిన సభ్యులు కొందరు నిన్న, రాజ్‌కోట్‌లోని కలెక్టరు కార్యాలయానికి చేరుకున్నారు. ‘గత కొద్ది సంవత్సరాలుగా గోవధ సంఘటనలు పెరిగిపోతున్నాయనీ, గోవధని ఆపాలంటే ఆవుని జాతీయ జంతువుగా గుర్తించాలనీ’ వీరంతా అక్కడ నినదించడం మొదలుపెట్టారు. ఈ విషయమై తాము ఇదివరకే జిల్లాకలెక్టరుకు ఓ వినతిపత్రాన్ని అందచేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ మండిపడ్డారు. తాము గోభక్తులమనీ... గోవుని జాతీయ జంతువు చేయాలన్న తమ లక్ష్యం కోసం, ప్రాణాలనైనా తీసుకుంటామని హెచ్చరించారు. అన్నట్లుగానే, వీరిలో ఓ ఎనిమిదిమంది తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందుని తాగేశారు. పోలీసు అధికారులు అప్రమత్తమై వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. ఎనిమిదిమందిలో ఒకరు మృతి చెందగా మిగతావారి పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది.


.jpg)



