Latest News
డ్రగ్స్ కేసులో కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
posted on: Mar 18, 2026 8:14PM
.webp)
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా రిమాండ్‌లో ముగ్గురు ప్రధాన నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటీషన్‌పై కోర్టు తీర్పును ఈ నెల 20కి రిజర్వ్ చేసింది. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఏ1 నమిత్ శర్మ, .ఏ2 పైలట్ రోహిత్ రెడ్డి, ఏ3 రితేష్ రెడ్డిలను పోలీసులు 10 రోజులు కస్టడీకి కోరారు. ఆర్మ్స్ యాక్ట్, ఎన్‌డిపిఎస్ యాక్ట్ తో పాటు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నిందితులు నాలుగు రోజులుగా చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
ప్రధానంగా పైలెట్ రోహిత్ రెడ్డిని విచారిస్తే కీలక సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఫామ్ హౌస్ లో పోలీసుల సోదాల సందర్భంగా కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది? ఎవరి ఆదేశాల మేరకు కాల్పులు జరిపారు? డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? పార్టీ ఎవరు..? ఎందుకు నిర్వహించారు? అనే అంశాలపై విచారించాల్సి ఉందని పీపీ కోర్డుకు విన్నవించారు. అయితే ఇప్పటికే ఫామ్ హౌస్ కేసులో విచారణ పూర్తయిందని.. కస్టడీ అవసరం లేదని నిందితుల తరఫున న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మార్చి 20క తీర్పును రిజర్వ్ చేశారు..


.webp)



