అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

posted on: Feb 9, 2026 2:06PM

 

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు మరో 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది. గతేడాది నవంబర్ 12న పెట్టి కేసులో ఆయనను కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ర్యాలీ చేయగా దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను రాజమండ్రి జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చారు. 

కాగా మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ నెలలో వైసీపీ  ధర్నా చేపట్టింది. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా తలెత్తిన పరిస్థితుల్లో పోలీసుల విధులకు ఆయన ఆటంకం కలిగించారని ఆ రోజు కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...