పిన్నెల్లి సోదరుల బెయిల్ పిటిషన్ డిస్మిస్

posted on: Feb 10, 2026 8:19AM

జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న  వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్ ను గురజాల కోర్టు డిస్మిస్ చేసింది.  పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో గత ఏడాది మే 24న టీడీపీ నేతలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, జెవిశెట్టి కోటేశ్వరరావుల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , వెంకట్రామిరెడ్డి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.  

ఈ కేసులో సుప్రిం ఆదేశాల మేరకు గత ఏడాది డిసెంబర్ లో పిన్నెల్లి బ్రదర్స్  మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయిన సంగతి విదితమే.  అప్పటి నుంచి వీరు  రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడు వీరి బెయిల్  పిటిషన్‌ను  గురజాలలోని 10వ అదనపు జిల్లా న్యాయస్థానం కొట్టివేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...