నకిలీ మద్యం కేసు.. నిందితులకు రెండో సారి కస్టడీ

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో  కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో అరెస్టైన నిందితులను రెండో సారి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  నకిలీ మద్యం కేసులో కీలక నిందితులు జనార్ధన్ రావు, జగన్మోహన్ రావులను 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు ఈ కేసులో ఏ1 జనార్దన్ ,ఏ2 జగన్మోహన్​లను 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బుధవారం (నవంబర్ 19) నుంచి నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల 22 వరకూ వీరిని కస్టడీలోకి తీసుకుని ఎక్సైజ్ శాఖ విచారించనుంది.

  అయితే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాలని కోర్టు షరతు విధించింది. వీరిద్దరినీ గతంలో వారం రోజుల పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని ఎక్సైజ్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలను రాబట్టేందుకు మరోసారి విచారణకు అనుమతి కోరుతూ ఎక్సైజ్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారి వినతిని పరిగణనలోనికి తీసుకున్న ఎక్సైజ్ కోర్టు అందుకు అనుమతి మంజూరు చేసింది.  ప్రస్తుతం ఏ1 జనార్ధన్​రావు నెల్లూరు కేంద్రకారాగారం, ఏ2 జగన్మోహన్ రావు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్​లో ఉన్న సంగతి తెలిసిందే. 

ఇలా ఉండగా జోగి రమేష్ సోదరుల కస్టడీ పిటిషన్ పై విచారణకు విజయవాడ కోర్టు గురువారం (నవంబర్ 20)కి వాయిదా వేసింది.  ఇదే కేసులో అరెస్టైన జోగి బ్రదర్స్ జోగి రమేష్, జోగి రామును పది రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని కోరుతూ అబ్కారీ శాఖ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు తదుపరి వాచారణకు వాయిదా వేసింది. కకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఏ18నానూ, జోగి రాము ఏ19గాను ఉన్న సంగతి తెలిసిందే. వీరిరువురూ కూడా ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu