Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు షురూ
posted on: May 4, 2026 8:06AM
.webp)
దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తమౌతున్నఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం (మే 4) వెలువడనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు అంటే.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని ఎడ్జ్ ఉంది.
ఇక తమిళనాడు విషయానికి వస్తే.. ఇక్కడ ఈ సారి త్రిముఖపోరు జరిగింది. డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇక్కడ తలపడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం డీఎంకే కూటమి విజయం సాధించి మరో సారి అధికారపగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే.. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉందంటున్నారు.
అలాగే కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల పోరు జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ఈ సారి యూడీఎఫ్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రమైన అసోంలో బీజేపీ మరో సారి అధికారం చేజిక్కించుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పేర్కొన్నాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో బీజేపీ కూటమి మరో సారి అధికారం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.



.webp)


