Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాబాలు.. వాళ్ల నేరాలు.....
posted on: Aug 29, 2017 12:28PM

గుర్మీత్ రామ్ రహీమ్ కు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అతను చేసిన పనులకు గాను కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఇక్కడితో ఈ విషయానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఇప్పుడు గుర్మీత్ వంతు అయిపోయింది...భవిష్యత్తులో ఇంకా ఏ బాబా గురించి నిజాలు బయటపడతాయో చూడాలి. నిజం చెప్పాలంటే దేశంలో రామ్ రహీమ్ ఒక్కడే కాదు.. ఇంకా చాలామంది ఫేక్ బాబాలే ఉన్నారు. ఇప్పటికే ఆ బాబాల ఆగడాలు బయటకు వచ్చాయి. భక్తి పేరుతో వారు చేసే పిచ్చి పిచ్చి వేశాలు.. బయటకు వచ్చాయి. ఆఖరికి వారికి శిక్ష పడింది. సంత్ ఆశారామ్ బాపు, గురు రాంపాల్ దాస్, బాబా జై గురుదేవ్.. ఇప్పుడు గుర్మీత్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పలువురు బాబాలు.. వారు చేసిన నేరాలు గురించి ఓసారి చూద్దాం.
సంత్ ఆశారామ్ బాపు...
హరియాణాలోని హిస్సార్‌లో సంత్ రాంపాల్ ప్రస్తుతం రాజస్థాన్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. సంత్ రాంపాల్‌కు చెందిన సంత్‌లోక్ ఆశ్రమంలో అయిదుగురు మహిళల శవాలను పోలీసులు గుర్తించారు. ఒక మైనర్ బాలిక శవం కూడా లభ్యమైంది. ఆశ్రమంలోకి పోలీసులను రానివ్వకుండా తన శిష్యులతో మానవ కవచాన్ని నిర్మించి పెద్దఎత్తున ఆందోళనళకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో ఆరుగురు చనిపోయారు. ఈ కేసులను విచారించిన న్యాయస్థానం సంత్ రాంపాల్‌కు 22 నెలల జైలు శిక్ష విధించింది.
గురు రాంపాల్ దాస్..
గురు రాంపాల్ దాస్… ఈయన కూడా హర్యానా బాబానే మూడేళ్ల క్రితం హత్యల కేసులో ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై ఈయన ప్రైవేటు సైన్యం దాడులు చేసింది…. వేలాదిమంది కత్తులు, తుపాకులు, ఏకే 47లతో పోలీసులపై దండయాత్ర చేశారు… ఎంతోమంది చనిపోయాక కానీ ఈ బాబా లొంగిపోలేదు…
బాబా జై గురుదేవ్…
ఈ బాబా ఓ స్వయంప్రకటిత దైవజనుడు. ఈయన మధురలో ఏకంగా ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి కోట లాంటి ఆశ్రమం కట్టాడు. ఈ కబ్జాకోరును ఖాళీ చేయించడానికి వెళ్లిన జిల్లా ఎస్పీనే కాల్చి పారేయించాడు. ఇక బాబా అనుచరులంతా కబ్జాకోర్లే. వారి సాయంతో ఢిల్లీ-మధుర హైవేపైన, ఇటావా జిల్లాలో పలు విలాసవంతమైన ఆశ్రమాలను బాబా నిర్మించారు. రూ.4 వేల కోట్ల విలువ చేసే భూములు ఆయనకున్నాయి. రూ.150 కోట్ల విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి. ఇక కబ్జాకోరులైన బాబా అనుచరులపై యూపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి మండలి 16 కేసులు నమోదుచేసింది.
నిత్యానంద స్వామి
ఇక నిత్యానంద స్వామి రాసలీలల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన శృంగార స్వామీజీగా పేరు మోశారు. ఈ స్వామిని డిల్లీ పోలీసులు 6 గురి ఆడవారితో ఉన్నప్పుడు ఖైదు చేసేరు. ఉత్తరప్రదేశ్లోని చాం రౌహో గ్రామస్తులు ఈ స్వామిని ఒక దేవునిగా కోలుస్తూ వచ్చేవారు. ఈ స్వామి అరెస్ట్ అవడం, అందులోనూ అతను ఒక సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని తెలుసుకున్నతరువాత ఆ గ్రామస్తులు షాక్ కు లోనైనారు.ఈ దొంగ స్వామి ఆడవారితో వ్యాపారం చేయడమేకాకుండా వారిని విదేశీయులకు అమ్మి డబ్బుతోపాటు తుపాకులు తీసుకునేవాడట.ఈ దొంగ స్వామి అసలుపేరు సివ్ మురాట్.
ఆశారాం బాపు యావంతా
వరుస అత్యాచారాల ఆరోపణలతో జైలులో ఆశారాం బాపు కాలం వెళ్లదీస్తున్నాడు. చిన్న పిల్లలపై లైంగిక అకృత్యాలు - హత్యలు ఆశారాం బాపు ఇమేజీని మసకబార్చేశాయి. ఇక ఆశారాం బాపు బాటలోనే నడిచిన ఆయన కుమారుడు నారాయణ్ సాయిపై కూడా పది కేసులున్నాయి.
స్వామి అమృత చైతన్య
స్వామి అమృత చైతన్య పేరుతో ప్రజాదరణ పొందిన స్వామి సంతోష్ మాధవన్. కేరళకు చెందిన ఈ మతబోధకుడు పలు రకాలైన మోసాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక ఎన్నారై మహిళను మోసం చేసి రూ. 45 లక్షలు వసూలు చేసినట్లు అభియోగాన్ని ఎదుర్కొన్నారు. ఇది కాక ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది.
జ్ఞాన చైతన్య
మూడు హత్యా నేరాలపై స్వామి జ్ఞాన చైతన్య 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తన నేర ప్రవృత్తిని విడనాడలేదు. ఒక బ్రిటిషు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
రాధేమా
రాధేమా దుర్గా అవతారమట.. సన్యాసినిగా ఉంటూ ఆపదలో ఉండే వారి సమస్యలను పరిష్కరిస్తానని కొత్త అవతారమెత్తిన సుఖ్వీందర్ సింగ్ అనే మహిళ... ముంబైని కేంద్రంగా చేసుకుని రాధేమా గా అవతారం ఎత్తిన వైనం మనకు తెలిసిందే. అదనపు కట్నం కోసం వేధించాలంటూ తన భర్త అత్తామామలను రాధేమా ఆదేశించిందంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుర్గా అవతారమని చెప్పుకునే రాధేమా అసలు విషయం వెలుగు చూసింది. సన్యాసినిగా ఉంటూనే... ఆధునిక దుస్తులు - ఆభరణాలు - అలంకరణలతో ఇట్టే స్టార్ హీరోయిన్ ను తలపించే రీతిలో కనిపించే రాధేమా.. అదరగొట్టే స్టెప్పులతో డ్యాన్స్ చేస్తున్న వీడియోలతో అడ్డంగా బుక్కైంది.
మరి ఇదంతా చూస్తున్న జనాలు ఇప్పటికీ అలాంటి దొంగ బాబాలను ఎందుకు ఆదరిస్తున్నారో ఇక్కడ సమాధానం రాని పెద్ద ప్రశ్నగా మారింది. అసలు పిచ్చి వేషాలు వేసే ఇలాంటి వాళ్లను బాబాలుగా ఎలా అంగీకరిస్తున్నారు జనం. వాళ్లు తప్పు చేశారని తెలిశాక కూడా వాళ్లను గుడ్డిగా ఎందుకు సమర్థిస్తున్నారు….కోర్టు తీర్పుల తర్వాత కూడా భక్తుల తీరులో ఎందుకు మార్పు రావడం లేదు? జనం విచక్షణా జ్ఞానం కోల్పోతున్నారా..?ఆధునికత, నాగరికత పెరిగేకొద్దీ మనిషిలో విచక్షణా జ్ఞానం మరింత పెరగాలి… అయితే పరిస్థితి దీనికి రివర్స్‌లో ఉంది… మనిషి మరింత వెనక్కిపోతున్నాడు. చదువుకున్న వాడి దగ్గర నుండి.. చదువుకోలేని వాళ్లు కూడా ఇలానే ఉంటే భక్తులతో నిండిపోయిన భారత భవిష్యత్తు అతి భయానకంగా మారడం తథ్యం.






