బీజేపీలోకి జంప్ కానున్న శ్రవణ్?

 

 

 

పీఆర్పీ ద్వారా రాజకీయాల్లోకి ఎంటరై, పీఆర్పీని మూసేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌ని తెరాస సీమాంధ్రులను తిట్టడానికి బాగా వాడుకుంది. శ్రవణ్ సీమాంధ్రులను తిడుతుంటు ఆ మాటలకు తెలంగాణ వాళ్ళ కళ్ళలోంచి కూడా నీరు వచ్చేది. సీమాంధ్రులకు అయితే గుండె రగిలిపోయేది. సీమాంధ్రులను తిట్టడంలో, అడ్డంగా వాదించడంలో స్పెషలిస్టు అయిన శ్రవణ్ తనకు కేసీఆర్ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వలేదని లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ జిలానీ అయ్యాడు.

 

కాంగ్రెస్‌లోకి జంప్ కాగానే తెలంగాణ కాంగ్రెస్ ఆయనకి అధికార ప్రతినిధి హోదా ఇచ్చింది. దాంతో అప్పటి  వరకూ కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తున్న అధికార ప్రతినిధులకు మండింది. శ్రవణ్ రోజుకో ప్రెస్‌మీట్ పెట్టి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ని నానా తిట్లూ తిట్టడం మొదలుపెట్టాడు. మొన్నటి వరకూ కేసీఆర్ని దేవుడని పొగిడిన నోటితోనే ఇప్పుడు తిట్టడానికి శ్రవణ్‌ ఎలాంటి ఇబ్బందీ పడటం లేదుగానీ, వినేవాళ్ళకే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అయినా సరే శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ని తిడుతూనే వున్నాడు. వినలేక వినేవాళ్ళు వింటూనే వున్నారు.



కాంగ్రెస్‌లో చేరిన పది రోజులలోపే శ్రవణ్ ఎంత ఎదిగిపోయాడంటే,  నిన్న రాహుల్ గాంధీ తెలంగాణకి వచ్చినప్పుడు ఆయన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించేంత ఎదిగిపోయాడు. ఇది కాంగ్రెస్‌లో వున్నవారికి ఎంతమాత్రం నచ్చడం లేదు. శ్రవణ్‌ని అవసరమైనదానికంటే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారన్న రుసరుసలు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రారంభమయ్యాయి. శ్రవణ్ చాలా ఎక్కువ చేస్తున్నాడన్న కంప్లయింట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి.


మరోవైపు శ్రవణ్‌కి కూడా కాంగ్రెస్ పార్టీలో వున్న చాలామంది తనను శత్రువులా చూస్తూ వుండటం భరించలేకపోతున్నాడు. తాను తన ‘టాలెంట్’తో ఎదిగిపోతుంటే టీ కాంగ్రెస్‌లో  ఓర్వలేకపోతున్నారని ఫీలైపోతున్నట్టు సమాచారం. అందువల్ల కాంగ్రెస్‌ని కూడా విడిచిపెట్టి, భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భావిస్తున్న బీజేపీలోకి జంప్ అయిపోతే మంచిదని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం పవన్ కళ్యాణ్ ద్వారా పావులు కదుపుతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే శ్రవణ్ త్వరలో బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu