కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లతో దాడి

posted on: Mar 16, 2026 2:44PM

 

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా లోని బోడుప్పల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి. మందుల సామ్యూల్  నివాసంపై భారతీయ జనతా యువ మోర్చ్  (బీజేవైఎం) కార్య కర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. హిందువులను కించపరిచే విధంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ వ్యాఖ్యలు చేశారంటూ బీజేవైఎం నాయకులు ఈ నిరసన వ్యక్తం చేశారు. 

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సామ్యూల్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని బీజేవైఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేవైఎం నాయ కులు ఈరోజు సోమవారం బోడుప్పల్‌లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లను విసరడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. 

నిరసనకు దిగిన కార్యకర్తలను చెదరగొట్టి, అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం అక్కడ ఎలాంటి అవాంఛనీయ మైన ఘటనలు జరగ కుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహ రించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో బోడుప్పల్ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కాగా,  మందుల సామ్యూల్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగు తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...