లోక్‌సభలో ఆర్మీ మాజీ చీఫ్‌ పుస్తకంపై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

posted on: Feb 2, 2026 2:07PM

 

లోక్ సభలో కాంగ్రెస్‌ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలతో గందరగోళం తలెత్తింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆరోపిస్తూ మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్‌ ముకుంద్‌ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్‌ ప్రచురించింది. ఆ వివరాలను  రాహుల్‌ లోక్‌సభలో ప్రస్తావించారు. ఆయన కామెంట్స్‌పై కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ప్రచురించని పుస్తకంలోని అంశాలపై ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాను చెప్పింది వందశాతం నిజమని, దేశభక్తి ఎవరికి ఉందో తెలుసని రాహుల్ స్పష్టం చేశారు. దీంతో సభల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష నేత చెబుతున్న బుక్ ఇంక విడుదల కాలేదని రిలీజ్ కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం సైన్యాన్ని వివాదల్లోకి లాగవద్దని హితవు పలికారు. దేశ భద్రత విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...