స్వయం ప్రకటిత క్రెడిట్.. మోడీ పాలనా రికార్డుపై కాంగ్రెస్ విమర్శలు
Published on: Thu Jun 11, 2026 12:17PM
.webp)
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనా రికార్డులపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ పాలనలో దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని ఆరోపించింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు.
మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు. గత పన్నెండేళ్లుగా సాగుతున్న మోదీ పాలన దేశ ప్రగతికి, అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని జైరాం రమేశ్ విమర్శించారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదని గుర్తు చేసిన ఆయన, సొంత బలం లేని ప్రభుత్వాన్ని నడుపుతూ చారిత్రక నాయకులతో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కాగా.. ఎన్‌సీపీ 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అసమానమైన దేశ నిర్మాణ కృషితో ఏ మాత్రం పోల్చలేమన్నారు.


