ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ ఆధిక్యత 19వేల ఓట్లు

జూబ్లీ బైపోల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యత పెరుగుతూ వస్తున్నది. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 19 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ జరిగిన ఏడు రౌండ్లలోనూ నవీన్ యాదవ్ కే ఆధిక్యత లభించింది.

 రౌండు రౌండు కూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత పెరుగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆ పార్టీ ఏజెంట్లు బయటకు వచ్చేశారు. ఇక బీజేపీ  అభ్యర్థి దీపక్ రెడ్డి అయితే ఐదో రౌండ్ పూర్తి కాగానే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. మరో వైపు కాంగ్రెస్ గెలుపు సంబరాలు ఆరంభించేసింది. గాంధీ భవన్ లో సందడి వాతావరణం నెలకొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu