బొబ్బిలి యుద్ధానికి వీరులేరీ?

 

విజయనగరం జిల్లా బొబ్బిలి అనగానే.. ఒక్కసారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బొబ్బిలి యుద్ధం నాటి వీరగాధలు కళ్లముందు కదలాడతాయి. కానీ అదంతా గత వైభవం. ఇప్పుడక్కడ యుద్ధాలు కాదుకదా, ఎన్నికల్లో పోరాడేందుకు కూడా వీరులు కనిపించడంలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. ఆ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకడం లేదు.

 

మున్సిపల్ ఎన్నికలకు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టకపోతే పార్టీ లేదనుకుంటారేమోనని కొన్ని వార్డుల్లో ఎవరో ఒకరిని పోటీకి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. ఆ పరిస్థితి గ్రామాల్లోకి వెళ్లే సరి కి తారుమారైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చే యడానికి అభ్యర్థులే లేని గడ్డు పరిస్థితి ఎదురైంది.

 

నిజానికి తొలినుంచి కాంగ్రెస్‌ పార్టీకి బొబ్బిలిలో మంచి పట్టుంది. డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేలుగా అదే పార్టీ నుంచి విజయం సాధించగా, బొబ్బిలి ఎంపీలు కూడా అఖండ మెజార్టీతో అదే పార్టీలో ఉంటూ గెలిచేవారు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీకి సుజయ్‌కృష్ణ రంగారావు రాజీనామా చేసిన తరువాత కేడర్ కూడా ఆయన వెంట వెళ్లడంతో పరిస్థితి మరీ దిగజారిపోయింది. రామభద్రపురంమండలంలో టీటీడీ బోర్డు సభ్యుడు చొక్కాపు లక్ష్మణరావు, మాజీ జెడ్పీటీసీ స భ్యుడు అప్పికొండ శ్రీరాములు నాయుడు, తెర్లాంలోని నర్సుపల్లి బాబ్జీరావు, బొబ్బిలిలోని ఇంటి గోపాలరావు వంటివారే పార్టీ ని లాగేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆ సమయలో టీడీపీ నుంచి ప్రభుత్వ మాజీ విప్ శంబంగిని తెచ్చారు. కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే.. ఇంతలో రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల నుంచి ఆ పార్టీని వదిలేసి నాయకులంతా వెళ్లిపోయారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పరి స్థితి ఏర్పడింది. రామభద్రపురంలో 14 స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కా గా, బాడంగిలోని 14 స్థానాలకు ఒకటే నా మినేషన్ వేశారు. తెర్లాం మండలంలో 17 స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu