బీటల బాటలో యుపిఎ!

posted on: Jan 31, 2014 10:17AM

 

 

 

రెండు పర్యాయాలు పరిపాలించి దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యుపిఏ శకం త్వరలో ముగిసిపోబోతోంది. వచ్చే ఎన్నికలలో యుపీఏ ఉనికే ఉండబోదన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ యుపీఏ ప్రభుత్వం రాబోతోందని, ఆ ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ నాయకత్వం వహించబోతున్నాడని కలలు కంటున్నారు. వీళ్ళ కలలు ఇలా వుంటే, వాస్తవంలో పరిస్థితులు మరోలా వున్నాయి.

 

ప్రస్తుతం యుపిఏ భాగస్వామ్య పక్షాలుగా వున్న అనేక పార్టీలు వచ్చే ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టే ఉద్దేశంలో లేనట్టు తెలుస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు, కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నీ యూపీయేలోని మిగతా పార్టీల మెడలకు కూడా చుట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూస్తున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన పార్టీలను కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇది యూపీఏలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ఎన్నికలలోపు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనట్టుగానే పోటీలో నిలబడితే మంచిదని అనేక పార్టీలు భావిస్తున్నాయి.



కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమయ్యే వ్యూహాలు రచిస్తున్నాయి. లేటెస్ట్ గా కాశ్మీర్‌కి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రస్తుతం యుపిఎలో వుంది. కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కేంద్రంలో మంత్రిగా వున్నారు. అలాగే కాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లాకి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోంది. అయితే కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యే ఆలోచనలో వున్నారు. కాశ్మీర్ పరిపాలనకు సంబంధించినే అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీ జోక్యం ఎక్కువ కావడం, తనను శాశించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ వుండటాన్ని ఒమర్ అబ్దుల్లా సహించలేకపోతున్నారు. దాంతో కాశ్మీర్‌కి సంబంధించినంతవరకు కాంగ్రెస్ పార్టీ జోక్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారాయన.



అదేవిధంగా ఈమధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ప్రజల్లో భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తే కేంద్రంలో యుపీఏలో భాగస్వామిగా వుండే మాట దేవుడెరుగు.. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని కాశ్మీర్‌లో కూడా అధికారం పోయే ప్రమాదం వుందని ఒమర్ అబ్దుల్లా భయపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టు అర్థమవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...