బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మైనర్లను సైతం ప్రచారం లో వాడారంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై ఫిర్యాదు నమోదైంది.  యూసుఫ్ గూడా కు చెందిన షఫీయుద్దీన్ అనే  ఈ ఫిర్యాదు చేశారు.  ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ  కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.  

ఈ నెల 2న బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్  నిర్వహించిన సమావేశంలో  కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా,  ఒక మైనర్ బాలిక ను వేదికపై తీసుకువచ్చి రాజకీయ ప్రేరేపిత , భావోద్వేగ ప్రకటన చేయించారనీ, తద్వారా ఓటర్లలో  సానుభూతిని ప్రేరేపించడానికి,  ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  మైలేజ్ ల కోసం మైనారిటీ తీరన పిల్లలను ప్రచార సభలకు తీసుకువస్తున్నారంటూ షపీవుద్దీన్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి  తక్షణమే చర్యలు తీసు కోవాలని  కోరారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu