Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ మూడు లక్షణాలు బలంగా ఉన్న వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే.. విజయం సాధించలేడట..!
posted on: Jan 27, 2026 3:47PM

ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయం కోసం తహతహలాడుతూ ఉంటాడు. విజయం సాధిస్తే తన జీవితం సంతోషంగా ఉన్నట్టు లెక్క అనుకుంటాడు. ఎంత బలవంతుడు అయినా సరే.. మూడు లక్షణాలు చాలా బలంగా ఉంటే అది మనిషిని విజయానికి దూరం చేస్తుందని అంటున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి? అవి మనిషిని ఎందుకు విజయానికి దూరం చేస్తాయి? తెలుసుకుంటే..
అనుబంధం..
మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో అనుబంధం కలిగి ఉంటడం చాలా మంచిదే. ఇది వ్యక్తుల మధ్య బంధాన్ని బలంగా మారుస్తుంది. కానీ మితిమీరిన అనుబంధం పెంచుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా మిగిలిన అన్ని విషయాల నుండి దృష్టి మరల్చుతాడు. దీని వల్ల ఆ వ్యక్తిలో ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత తెలివైన వారు అయినా.. విజయం సాధించలేరు.
ఈ విషయాన్ని శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఎవరితో అయినా అనుబంధం ముఖ్యమే కానీ అది మితిమీరితే కొన్ని సార్లు వ్యసనంగా మారుతుంది. ఇదే మనుషులను విజయానికి దూరం చేస్తుంది.
అహంకారం..
అహంకారం ఉన్న మనిషి అధముడు అని అంటారు పెద్దలు. మనిషి అహంకారమే ఆ మనిషి వినాశనానికి దారి తీస్తుంది. ఎంత తెలివైన వ్యక్తి అయినా, ఎంత ధనవంతుడు అయినా అహంకారం ఉంటే విజయం సాధించలేడు.
అహంకారం ఉన్న వ్యక్తి ఏ బంధాలను కొనసాగించలేడు. అలాగే తన తప్పులను తెలుసుకోలేడు. తన తప్పులను తెలుసుకోలేని వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు. ఎందుకంటే తప్పు చేసే వ్యక్తి ఎప్పుడూ తప్పు మార్గంలోనే ప్రయాణిస్తాడు. అలాంటి వ్యక్తికి విజయం చాలా దూరంలో ఉంటుంది.
సోమరితనం..
సోమరితనం విజయానికి పెద్ద అడ్డంకి. సోమరితనం ఉన్నవారు పనిని వాయిదా వేస్తూ ఉంటారు. కష్టపడి పని చేయడానికి సిద్దంగా ఉండరు.
కష్టపడి పని చేయడం, క్రమశిక్షణతో ఉండటం వల్ల మాత్రమే విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. ఆ లక్షణాలు లేని వారు విజయం సరిహద్దును కూడా తాకలేరు.
*రూపశ్రీ


.webp)



