Latest News

ఉమ్మడి పోలీసింగ్‌తో సీమాంధ్రులకు భద్రత

posted on: Jul 14, 2014 3:09PM

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో వుంటున్న సీమాంధ్ర ప్రజల భద్రతకు చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద వుంది. హైదరాబాద్‌లో వుంటున్న సీమాంధ్రులు రాష్ట్ర విభజన తర్వాత అభద్రతాభావానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీమాంధ్రులను కడుపులో పెట్టుకుని చూస్తామని హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులను నమ్మే స్థితిలో సీమాంధ్రులు లేరు. కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న తెలంగాణ నాయకుల తీరు కూడా సీమాంధ్రులకు భయాందోళనలు కలిగిస్తోంది. హైదరాబాద్‌లో తమ భద్రతకు స్పష్టమైన భరోసా వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉమ్మడి పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నుంచి గవర్నర్‌కి లేఖ రావడం, ఈ విధానాన్ని త్వరగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వత్తిడి చేస్తూ వుండటం హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు కొంత ఊరటగా వుంది. ఈ విధానం అమలులోకి వస్తేనే సీమాంధ్రులు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోగలుగుతారు. అయితే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని సీమాంధ్రుల మీద కర్రపెత్తనం చెలాయించాలనుకునే తెలంగాణ నాయకులు మాత్రం ఉమ్మడి పోలీసింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతకాలం తమ రాజధాని అనుకుని హైదరాబాద్‌లో జీవించిన సీమాంధ్రులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటానికే ఇలా ఉమ్మడి పోలీసింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో వున్న సీమాంధ్రుల ఆందోళనలు తొలగాలంటే తెలంగాణ నాయకులు ఉమ్మడి పోలీసింగ్ విధానాన్ని అంగీకరించాలన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...