సమ్మర్ సీజన్..కోస్తాలో ఊపందుకున్న కోడి పందాలు

posted on: Apr 15, 2017 12:06PM

సంక్రాంతి పండుగ అసలే కాదు..పంట చేతికి వచ్చే టైము కాదు కానీ ఏపీలో పందెం కోళ్లు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కోస్తా జిల్లాల వ్యాప్తంగా కోడి పందాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో కోడిపందాలు ఆడుతున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 7 కార్లు, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు..మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలోనూ కోడి పందాలు ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఒక కారు, మూడు బైకులు రూ.2.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...