వైద్య సేవల వాహనాలను పరిశీలించిన తమిళనాడు సీఎం

posted on: May 20, 2026 3:40PM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్  పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు.   ప్రజల ఆరోగ్యం, ప్రజా సంక్షేమంపై  ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో   వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్‌రాజ్, చీఫ్ సెక్రటరీ ఎం. సాయి కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి దరేజ్ అహమ్మద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం సీఎం విజయ్ ప్రజల కోసం కొత్తగా ప్రవేశపెట్టనున్న అత్యవసర వైద్య సేవల వాహనాలు,  సంచార వైద్య శాలల రథాలను   క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేశారు. అత్యాధునిక సాంకేతికతతో, అత్యవసర ప్రాణ రక్షణ పరికరాలతో సిద్ధం చేసిన ఈ మెడికల్ సర్వీస్ వాహనాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.  రోగులకు, ప్రమాదాలలో గాయపడిన బాధితులకు సకాలంలో నాణ్యమైన చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ వాహనాలను రూపొందించారు. కేవలం నిలబడి చూడటమే కాకుండా.. తానే స్వయంగా ఒక వాహనం డ్రైవింగ్ సీట్లో కూర్చుని, వాహనాన్ని నడిపి చూశారు.

 గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో కోలాత్తూరులో తన కాన్వాయ్ వల్ల అంబులెన్స్‌కు దారి దొరకలేదనే ఆరోపణలు వచ్చిన సంగతిని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి అయిన వెంటనే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు ఎంత వేగంగా అందాలనే దానిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రజల ప్రాణాల కంటే విఐపి కాన్వాయ్‌లు ముఖ్యం కాదని స్పష్టం చేస్తూ.. అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...