60 లక్షల నగదుతో సీఎంఎస్ డ్రైవర్ పరార్

posted on: Feb 13, 2026 8:27AM

ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సీఎంఎస్ డ్రైవర్ వాహనంలోని 50 లక్షల రూపాయల నగదుతో సహా అదే వాహనంలో పరారైన సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ని గోపన్నపల్లిలో జరిగింది.  

పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సిఎంఎస్ సంస్థకు చెందిన ప్రత్యేక భద్రతా వాహనం గురువారం (ఫిబ్రవరి 12) సాయంత్రం  నాలుగున్న గంటల ప్రాంతంలో  గోపన్‌పల్లిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో నగదు నింపేందుకు అక్కడకు చేరుకుంది. వాహనంలో డ్రైవర్ అజిత్ అలియాస్ శివ, ఇద్దరు కస్టోడియన్లు, ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నారు. కస్టోడియన్లు బ్యాంక్ లోపల ఏటీఎంలో నగదు నింపే పనిలో నిమగ్నమై ఉండగా, సెక్యూరిటీ గార్డు వాష్‌రూమ్‌ కు వెళ్లాడు.అదే అవకాశం గా భావించిన డ్రైవర్ అజిత్ వాహనాన్ని నగదుతో సహా అక్కడి నుంచి తీసుకుని పరారైయ్యాడు.

కొంతసేపటి తరువాత బ్యాంక్ సిబ్బంది మరియు కస్టోడియన్లు బయటకు వచ్చి వాహనం కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. కొన్ని గంటల తరువాత తెల్లాపూర్ సమీపంలో వాహనం  నిలిపివేసి ఉండటాన్ని గమనించారు. అయితే వాహనం లోపల ఉన్న దాదాపు  రూ.60 లక్షల నగదు కనిపించకపో వడంతో డ్రైవర్ నగదుతో పరారైనట్లు గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పట్టపగలే భద్రతా వాహనం నుంచి ఇంత భారీ మొత్తం లో నగదు అపహరణకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...