జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
posted on: Feb 8, 2026 5:20PM
.webp)
తెలంగాణలో ఏ జిల్లాలను తొలగించేది లేదు... కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటి ఇచ్చారు. జిల్లాల పునర్వవస్థికరణ కోసం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. రేగొండ మండలం కొడవటంచ చేరుకున్న సీఎం, శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి, పక్కనే ఉన్న బాల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రూ.12.15 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ పనుల్లో భాగంగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
నూతన జిల్లాల ఏర్పాటు ఈ విషయంలో ప్రజలు సలహాలు, సూచనలు తీసుకోని చేస్తామని తెలిపారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దని ముఖ్యమంత్రి కోరారు. దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా సమ్మక్క-సారక్క జాతరను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి చేశారని సీఎం రేవంత్ కొనియాడారు. 2027లో గోదావరి పుష్కరాల సందర్బంగా ఆదిలాబాద్‌లోని బాసర నుంచి ఖమ్మంలోని భద్రాచలం వరకు రూ.4 వేల కోట్లతో అన్ని ఆలయాలను పర్యాటక ప్రాంతాలు తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు.
తెలంగాణ ఉద్యమాల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కీలకం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నల్లబంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు దేశానికి ఆదర్శం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. భూపాలపల్లి కుగ్రామంగా ఉన్న సమయంలో అన్న నందమూరి తారకరామరావు మొట్టమొదట దీన్ని మండల కేంద్రంగా మార్చి సింగరేణి బొగ్గు ఉత్పత్తికి మొట్టమొదటి పునాది రాయి వేశారు. దాంతో ఆ తర్వాత భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. దీనికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సీఎం అన్నారు



.webp)


