Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే : రేవంత్ రెడ్డి
posted on: Feb 12, 2026 7:52PM
.webp)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వడంపై తన మద్దతు ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడని.. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు.. జాతీయ సొత్తు అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తాను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నానన్నారు. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంతా మూర్ఖులు ఎవరు ఉండరన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తానే రాజు తానే మంత్రినని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరితోనూ పోల్చుకోనని.. తనకు ఎవరూ పోటీ కారన్నారు. ఈ సందర్భంగా 2029లో జమిలి ఎన్నికలు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ఘాటించారు.



.webp)


