ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

posted on: Feb 13, 2026 3:59PM

 

ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పైన చ‌ర్చ జ‌రిగింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంపై ప్రియాంక గాంధీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రిని ఆమె ప్ర‌త్యేక్యంగా అభినందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఘ‌న విజ‌యం క‌ట్ట‌బెట్టార‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియ‌జేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...