Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
posted on: Mar 4, 2026 7:31PM

తెలంగాణ పోలీసులకు మావోయిస్టు అగ్రనేతలు టచ్‌లోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా పార్టీకి దీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గణపతి తరఫున తెలంగాణ పోలీసు లకు సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. భద్రతా సంస్థలతో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు ప్రారంభమయ్యాయని, సురక్షిత లొంగుబాటు కోసం నిబంధనలు, హామీలపై చర్చలు సాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయంపై అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయ లేదు. ఇటీవల మావోయిస్టు నేత దేవ్‌జీ లొంగిపోయిన సందర్భంలో గణపతి ఆచూ కీపై కీలక సమాచారం లభిం చిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. దేవ్‌జీ సమర్పణ తర్వాత మావో యిస్టు అగ్రనేతల కదలికల పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గణపతి ఆరోగ్య పరిస్థితి, వయసు, అలాగే మావోయిస్టు కార్యకలాపాల బలహీనత నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు ఆసక్తి చూపుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తు న్నాయి.
కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు సమన్వయంతో పరిస్థితిని గమనిస్తున్నట్లు సమాచారం.గణపతి లొంగుబాటు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు లేదా ప్రభుత్వ వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువ డితేనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు నిజమైతే, తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఇది కీలక మలుపు కావచ్చని భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి , ఐజీ సుమతి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్ల ప్రక్రియ వేగవంతం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవూజీ తో సహా పలువురు కీలక నేతల లొంగుబాట్లపై చర్చించినట్లు సమాచారం. లొంగుబాటు తర్వాత వారికి కల్పించాల్సిన భద్రత, పునరావాసం, కేసుల పరిశీలన తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రితో వివరణాత్మకంగా చర్చించినట్లు తెలుస్తోంది.
దేవూజీతో జరిగిన సమావేశంలో మావోయిస్టులు ఉంచిన డిమాండ్లు, శాంతి చర్చలకు సంబంధించిన ప్రతిపాదనలు, అభివృద్ధి హామీలు వంటి అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ నెల మార్చి 31వ తేదీన నిర్వ హించనున్న “మావోయిస్టు రహిత భారత్” కాన్ఫరెన్స్‌కు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ జరిగింది.
దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న చర్యలు, రాష్ట్రాల సమన్వయం,కేంద్ర-రాష్ట్రాల మధ్య వ్యూహాత్మక సహకా రం వంటి అంశాలపై సమ గ్రంగా సమీక్షించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శాంతి, భద్రత, అభివృద్ధి అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రంతో కలిసి సమగ్ర వ్యూహంతో మావోయిస్టు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


.webp)



