మధిరలో సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు.. కారణమేంటంటే?

posted on: Jun 29, 2026 3:04PM

తెలంగాణ రాజకీయాల్లోనూ, వ్యవసాయ రంగంలోనూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధిర పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో మంగళవారం (జూన్ 30) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన  రైతు ఆశీర్వాద సభ.. భారీ వర్షాల కారణంగా రద్దైంది.   గత కొన్ని రోజులుగా  కురుస్తున్న  వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు. అయితే.. మధిరలో సభ రద్దైన ప్పటికీ,  రైతాంగానికి అందించాల్సిన లబ్ధిని, భరోసాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయ కూడదన్న కృత నిశ్చయంతో..  రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ బృహత్తర కార్యక్ర మాన్ని నిలిపివే యకుండా..  ప్రత్యామ్నాయంగా,  మధిరలో జరగాల్సిన ఈ వేడుకను తక్షణమే హైదరాబాద్‌  శిల్పకళా వేదికకు తరలిస్తూ  నిర్ణయం తీసుకున్నారు.

వాతావరణం అనుకూలించకపోయినా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతుల వద్దకే నేరుగా వెళ్లాలని ప్రభుత్వం నిశ్చయించింది. శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం  ఈ సభ అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సభను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా.. రైతు భరోసా పంపిణీ సదస్సు గా నామకరణం చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

 డిజిటల్ విప్లవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఈ వేడుకలో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. భౌతికంగా మధిరలో సభ సాధ్యం కాకపోయినా, అధునాతన డిజిటల్ ,  వర్చువల్ పద్ధతుల ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల పరిధిలోని రైతులను ఏకతాటిపైకి తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని రైతు వేదికల' నుంచి రైతులు నేరుగా ఈ శిల్పకళా వేదిక సదస్సును వీక్షించేలా ప్రత్యేక లైవ్ స్క్రీన్స్, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ,  ఆడియో-విజువల్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4:00 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...