Latest News
ఆధునీకరించిన శాసన మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
posted on: Mar 8, 2026 11:18AM

ఆధునీకరించిన తెలంగాణ శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
శాసనమండలిని అత్యాధునిక హంగులతో పునర్నిర్మించగా.. మేళ తాళాల మధ్య ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం మండలిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండలి చైర్మన్, మంత్రులతో కలిసి మండలిలో కూర్చుని కొద్దిసేపు ముచ్చటించారు. ఆధునిక హంగులతో సిద్దమైన ఈ భవనాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ శాసన సభ ప్రజాస్వామ్య విలుల పరిరక్షణకు ఈ వేదిక మరింత దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు.



.webp)


