Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు
posted on: Mar 18, 2026 7:52PM
.webp)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
గత సంవత్సరం ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా అందరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం అన్నారు.



.webp)


