మున్సిపల్ ఫలితాలపై మంత్రులను అభినందించిన సీఎం రేవంత్

posted on: Feb 14, 2026 7:58PM

 

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులని అభినందించారు. అందరం కలిసి కట్టుగా పనిచేయడం వల్లే మెజార్టీ స్థానాలు వచ్చాయి అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి అభినందనలు  తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపించిందని సీఎం అన్నారు. 

ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా పాలనపై నమ్మకాన్ని కలిగించాయి  అనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని రేవంత్‌రెడ్డి స్ఫష్టం చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు.ఎన్నికల ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఎక్స్ అఫీషియే ఓట్లు, హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఉపయోగించువాలని తెలిపారు. నిజామాబాద్‌ను కైవసం చేసుకోవాలని సూచించారు. కొత్తగుడెం కార్పోషన్‌లో ఇండిపెండెంట్లపై దృష్టిపెట్టాలని తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...