బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం : సీఎం రేవంత్

posted on: Feb 5, 2026 7:33PM

 

క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండి మండలం  గుమ్లాపూర్ లో ఏర్పాటు చేసిన “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇవి కార్యకర్తల ఎన్నికలని తెలిపారు. కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చినప్పుడే పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు ఆయన సూచించారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ గడ్డపై నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మాట ఇచ్చారని రేవంత్ గుర్తుచేశారు.  పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్లు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేం లేదని సీఎం అన్నారు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు వాళ్లు విషం చిమ్ముతున్నారని.. పదేళ్లలో కనీసం పేదలకు డబుల్ బెడ్రూంలు కూడా ఇవ్వలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన వెంటనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిమని తెలిపారు. 

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ది ఫెవికాల్ బంధమని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి పంపించామని.. ఆరు నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ఆలయాలను అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. ఢిల్లీ నుంచి కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధికి  కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం నిధులు తెచ్చారో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను బీఆర్ఎస్ గెలిపించిందని ఆరోపించారు. వారిది ఫెవికాల్ బంధమని సీఎం తెలిపారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...