ఎవరిది అగ్రికల్చరో... ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి : సీఎం రేవంత్
posted on Nov 9, 2025 1:50PM
.webp)
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ 100 శాతం గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ ఎందుకు చేయలేని రేవంత్ ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటే దేశం మొత్తం గెలిచినట్లేని ఆరోపించారు.. మరో కాంగ్రెస్ పార్టీ 8 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం. 2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. నేను చెప్పేది రాసి పెట్టుకోండి.. 2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమపై చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని సీఎం అన్నారు.
శ్రీలీల ఐటమ్ సాంగ్ కు, కేటీఆర్ ప్రచారానికి ఏం తేడా లేదని రేవంత్ విమర్శించారు. సొంత చెల్లి కవితను , మాగంటి తల్లిని కేటీఆర్ అవమానించారని రేవంత్ అన్నారు. సొంత కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని సరిగ్గా చూసుకుంటాడా? అనిప్రశ్నించారు.
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తని కిషన్ రెడ్డి.. గుజరాత్ కు గులాంగిరీ చేస్తూ.. తనపై ఒంటికాలిపై లేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై ఎగిరితే ఏమీ రాదని, ఏమన్నా ఉంటే ప్రధాని మోదీ దగ్గర మాట్లాడాలని సూచించారు. కేటీఆర్ తో కిషన్ రెడ్డి చెడు స్నేహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు, రేషన్ కార్డులు, సన్నబియ్యం ,రూ.500కే గ్యాస్ సిలిండర్, సంక్షేమ పధకాలను అమలు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణను నిలిచిందని తెలిపారు. కులగణన చేశామని సీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు ఇచ్చామని. మరో 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశామని సీఎం అన్నారు. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరే ఆలోచించండి. ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్. ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండిని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.