Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ చర్చ
posted on: Aug 1, 2025 5:11PM

సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్, సీఎస్ రామకృష్ణ సమావేశం అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను ముఖ్యమంత్రికి సీఎస్ అందించారు. ప్రస్తుతం నివేదికలోని కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం అందుతోంది. పీసీ ఘోష్ కమిషన్ తమ నిదేదికను నిన్ననే అధికారులకు అందజేసింది. కాళేశ్వరం రిపోర్ట్ అందిన తరవాత ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు.
ఇక నేడు కొద్దిసేపటి క్రితం నివేదికతో సీఎంను కలిసి ఆయనతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగించిన తీరు, చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు తీరుఉల్లంఘనలతోపాటు వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించారా లేదా? వంటి అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ అంశాలు, నిర్మాణ సంస్థలుకాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం, ఇతర అవకతవకతలపై విచారణ జరపాలని కోరింది. వచ్చే కేబినెట్ భేటీలో ఈ నివేదికపై చర్చించి.. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది.



.webp)


