Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రాండ్ అంబాసిడర్ బాల్... కేసీఆర్ కోర్టులోకి!
posted on: Aug 23, 2016 12:25PM

అమితాబ్ బచ్చన్ గుజరాత్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్. అందుకే, ఆయన గుజరాత్ రాష్ట్ర పర్యాటక శాఖ యాడ్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తుంటారు. అంతే కాదు, గుజరాత్ కు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో అప్పుడప్పుడూ పాల్గొంటూ వుంటారు కూడా. అది బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన బాధ్యత. అయితే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం... మీకు ఎప్పుడైనా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా అలా కనిపించిందా? ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది...
సింధు పతకం గెలిచాక ఎఫ్బీలో చాలా మంది షేర్ చేస్తున్న పోస్టుల్లో ఒకటి సానియా బదులు సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ చేయాలని! ఇలా ప్రచారం చేసేవాళ్లలో చాలా మంది రైట్ వింగ్ జనం కూడా వున్నారు. వాళ్లు సానియా మతాన్ని చూసి అలా నోరు పారేసుకుంటున్నారని మనం లైట్ తీసుకోవచ్చు. కాని, హిందూత్వ ఎజెండా లేని వాళ్లు కూడా కొందరు సానియా కంటే సింధు బెటర్ అంటున్నారు. కారణం... టెన్నిస్ సెన్సేషన్ మిసెస్ మీర్జా అంబాసిడర్ గా ఇప్పటి వరకూ ఏ ఒక్క బాధ్యతా నిర్వహించకపోవటమే. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు గుజరాత్ అంబాసిడర్ అమితాబ్ లా ఆమె యాక్టివ్ గా అస్సలు లేదు.
సానియానే కాదు చాలా మంది సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వున్నప్పుడు పెద్దగా యాక్టివ్ నెస్ చూపించరు. కాని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కోరి నియమించిన సానియా ఎంతో కొంత చేయాల్సి వుంది. కాని, ఇప్పటి వరకూ ఆమె ఎలాంటి చొరవా చూపించలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు, హరితహారం వగైరా వగైరా లాంటి అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. అలాగని సానియా మ్యాచ్ లతో ఫుల్ బిజీయా అంటే అదీ కాదు. ఆమె అనేక ప్రైవేట్ కార్యక్రమాల్లో దర్శనమిస్తూనే వుంది. చివరకు, కపిల్ శర్మా షో లాంటి కమర్షియల్ టీవీ షోస్ లో కూడా పాల్గొంటోంది.
సానియాకి భిన్నంగా సింధు ఇప్పటికే తెలంగాణ సంప్రదాయాన్ని నెత్తికెత్తుకుని బొనం సమర్పించింది అమ్మవారికి. ఆ ఫోటోల్ని చూపిస్తూనే నెటిజన్లు సానియా బదులు సింధు కావాలంటున్నారు. మరి ఇలాంటి డిమాండ్లని సీఎం కేసీఆర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సానియా మైనార్టీ వర్గానికి చెందిన అమ్మాయి కావటం వల్లే దురుద్దేశాలతో ఇలా టార్గెట్ చేస్తున్నారని కొట్టిపారేస్తారా... లేక వాల్డ్ ఛాంపియన్ గా నిలిచిన సింధు నిజంగా సానియా కంటే బెటర్ అని డిసైడ్ అవుతారా... వీ హ్యావ్ టూ వెయిట్ అండ్ సీ! బాల్ ఈజ్ ఇన్ కేసీఆర్స్ కోర్ట్...
ఎవరు బ్రాండ్ అంబాసిడరైనా యాక్టివ్ గా వుండి రాష్ట్ర ప్రగతికి తోడ్పడితే కోట్ల రూపాయల నజరానాలు సమర్పించుకున్నందుకు.... అదే పది వేలు!






